https://oktelugu.com/

Akkineni Nagarjuna : మంత్రి కొండా సురేఖ పై పంతం వీడని నాగార్జున.. శిక్ష పడాల్సిందే అంటూ హై కోర్టులో పోరాటం!

కొండా సురేఖ సమంత కి క్షమాపణలు చెప్పింది కానీ, అక్కినేని కుటుంబానికి మాత్రం క్షమాపణలు చెప్పలేదు. దీనికి ఆగ్రహించిన అక్కినేని నాగార్జున, తన కుటుంబం తో కలిసి నాంపల్లి హై కోర్టు లో కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకొని పరువు నష్టం దావా వేయాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం అందించి పిటీషన్ దాఖలు చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 08:51 PM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna :  అక్కినేని నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం గురించి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ పై యావత్తు ప్రజానీకం తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక మంత్రి స్థానం లో కూర్చొని ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు ఎలా చేయాలగిల్గారు అంటూ సినీ పరిశ్రమ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించి తీవ్రస్థాయిలో ఖండించిన సందర్భాలను కూడా మనం చాలా చూసాము. ముఖ్యంగా సమంత, అక్కినేని కుటుంబం మాత్రం కొండా సురేఖ వ్యాఖ్యలకు చాలా ఇబ్బంది పడ్డారు. కొండా సురేఖ సమంత కి క్షమాపణలు చెప్పింది కానీ, అక్కినేని కుటుంబానికి మాత్రం క్షమాపణలు చెప్పలేదు. దీనికి ఆగ్రహించిన అక్కినేని నాగార్జున, తన కుటుంబం తో కలిసి నాంపల్లి హై కోర్టు లో కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకొని పరువు నష్టం దావా వేయాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం అందించి పిటీషన్ దాఖలు చేసాడు.

    నేడు ఈ కేసు విచారణకు నాగార్జున తరుపున న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనలు వినిపించాడు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ ‘ ఒక బాధ్యత గల హోదాలో కూర్చున్న మహిళ, నా క్లయింట్ నాగార్జున కుటుంబం పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ మాటలకు నాగార్జునతో పాటు ఆయన కుటంబ సభ్యులు ఎంతో మానసిక క్షోభలు గురి అయ్యారు. ఇది క్షమించ దగినది కాదు, ఆమె కచ్చితంగా క్రిమల్ చర్యలకు అర్హురాలు,దయచేసి కోర్టు సరైన నిర్ణయం తీసుకోవాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన కోర్టుని కోరుకున్నారు. మరి హై కోర్టు తుది తీర్పు ఏమని ఇస్తుందో ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఆమె అసభ్యకరంగా బూతులు మాట్లాడినట్టు రికార్డెడ్ ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    ఇక నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ తెరకెక్కుతున్న కుబేర సినిమాలో మరో హీరో గా నటిస్తున్నాడు. ఇందులో ప్రముఖ హీరోయిన్ రష్మిక కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో పాటు నాగార్జున తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయనకీ సంబంధించిన ఒక వయొలెంట్ సన్నివేశం సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. నాగార్జున తన కెరీర్ లో మొట్టమొదటిసారి విలన్ పాత్ర చేయడంతో అభిమానులు కూడా చాలా ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇవి రెండు కాకుండా, ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.