Anvesh YouTube controversy : దేశదిమ్మరి చిక్కితే దొరకడు.. దొరికితే ఆగడు.. అని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రముఖ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నోటి దూలకు అతడు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు. ఎవరిని ఏ విధంగా తిడతాడు? ఎవరిని ఏ రూపంలో విమర్శిస్తాడు? అనేది ఎంతకూ అంతు పట్టదు. పైగా తన వీడియోలలో ద్వంద్వర్ధాలను నిత్యం ప్రయోగిస్తాడు. ఆడవాళ్ళతో అయితే దారుణంగా ప్రవర్తిస్తాడు. పైగా చవక.. అంటూ లేకి మాటలు మాట్లాడుతాడు. నేటి కాలంలో జనానికి కావాల్సింది బూతు కాబట్టి.. అతడిని విపరీతంగా ఆరాధించడం మొదలు పెట్టారు. అందువల్లే అతనికి ఏకంగా 23 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇంతటి స్థాయి వచ్చిన నేపథ్యంలో అతడి నెత్తికి కళ్ళు ఎక్కాయి. అంతేకాదు, పొగరుతో కళ్ళు మూసుకుపోయాయి. దీంతో హిందూ దేవతల మీద ఇష్టానుసారంగా మాటలు మాట్లాడాడు. ముఖ్యంగా ఆడవాళ్ళ వస్త్రధారణ పై పిచ్చి కూతలు కూశాడు. ఆడవాళ్లకు స్వాతంత్రం ఉండాలని.. అవసరమైతే బట్టలు విప్పుకొని తిరగాలని సూచించాడు. హిందూ దేవుళ్లపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో అతడిపై సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. అంతేకాదు, చాలామంది అతడిని అన్ ఫాలో చేశారు. 23 లక్షల సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న అతడు ఒకసారిగా 20 లక్షలకు పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడు క్షమాపణ చెప్పాడు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని లెంపలు తీసుకున్నాడు.
హిందూ సంఘాల ఐక్యత వల్ల అతడికి బుద్ధి వచ్చినప్పటికీ.. ఇప్పటికిప్పుడు అతడి అరెస్టు మాత్రం సాధ్యం కాదు. ఇప్పటికే నా అన్వేషణ అన్వేష్ పై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు అతడు విదేశాలలో ఉన్న నేపథ్యంలో అరెస్టు మాత్రం సాధ్యం కాదు. అతడి వ్యవహార శైలి పట్ల సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ అన్వేష్ తన ధోరణి మార్చుకోవడం లేదు. ఒక వీడియోలో క్షమాపణలు చెప్పిన అతడు, ఆ తర్వాత తనకు అలవాటైన ధోరణిలో మాట్లాడుతున్నాడు.. ఈ తరహా వ్యక్తులకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. అప్పుడే ఇంకొకసారి ఇటువంటి లేకి మాటలు మాట్లాడరు.