
కూకట్ పల్లీ హెచ్ డీఎఫ్ సీ కాల్పుల ఘటన మిస్టరీ వీడినా ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇప్పటికే ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం మరోకరు దొరకకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ఆలస్యముతున్నది. పరారీలో ఉన్న దుండగుడి వద్ద ఐదు లక్షల నగదు, తుపాకీ ఉండడంతో అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దోపిడి ఘటన తర్వాత ఇద్దరు దుండగులు సికింద్రాబాద్ లో రైలు ఎక్కి పరారయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.