
దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ లో మాత్రం వ్యాక్సిన్ల విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపించింది. 2,40,000 డోసుల వ్యాక్సిన్ల టీకాలతో ఉన్న ట్రక్కును డ్రైవర్లు రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకూ ఈ ట్రక్కు అలాగే ఉండిపోయింది. ఈ ఘటన నర్సింగాపూర్ జిల్లాలో జరిగింది. ఈ ట్రక్కును చూసిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ట్రక్కును తెరచి చూడగా అందులో రెండు లక్షల వ్యాక్సిన్ డోసులు కనిపించాయి. డ్రైవర్, క్లీనర్ కనిపించకపోవడంతో పోలీసులు మొబైల్ లొకేషన్ ను ట్రేస్ చేశారు.