
రైలు కింద పడి తల్లీ, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. సుమారు 30 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ, 6 ఏళ్ల వయసున్న ఓ బాలుడి మృతదేహాలను ఈ తెల్లవారుజూమున గుర్తించిన రైల్వే సిబ్బంది పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.