
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905 కి చేరింది. మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కొవిడ్ తో 52 మంది ప్రాణాుల కోల్పోయారు.