
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ 21,452 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన 19,095 మంది కోలుకున్నారు. 89 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 13,44,386 కి పెరిగాయి 11,38,028 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 90,750 శాంపిళ్లను పరీక్షించారు.