
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 18,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 10,227 మంది కోలుకున్నారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 11,63,994 పెరిగాయి. 10 లక్షల మందికి పైగా కోలుకున్నారు. యాక్టిక్ కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఈ రోజు వరకు 8207 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో లక్షా 15 వేల శాంపిళ్లకు పైగా పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.