
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీతో భేటీ కావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. అయితే తాము వ్యక్తిగత సంబంధాలకు అత్యంత విలువ ఇస్తామని, రాజకీయంగా చూడమని శివసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఎప్పడూ ఒంటికాలిపై లేచే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనను ఆకాశానికెత్తేశారు. మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలోనే టాప్ లీడర్, బీజేపీలో కూడా టాప్ లీడర్ అని కొనియాడారు.