
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ దూసుకెళ్లోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కరోనా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయినా పాజిటివ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి ఇవాళ మోదీ మూడు కీలక సమావేశాలు నిర్వహంచనున్నారు. భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. దీంతో కోవిడ్ నియంత్రణ కోసం ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.