మోదీ సలహాదారు అమర్జీత్ సిన్హా రాజీనామా

పీఎంవో లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు.  పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహరాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. బిహార్ క్యాడర్ కు చెందిన అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019 లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు పీఎంవో సలహాదారుగా నియమితులయ్యారు. అయితే పదవీ కాలం ఇంకా ఏడు నెలలు […]

Written By: Suresh, Updated On : August 2, 2021 5:57 pm
Follow us on

పీఎంవో లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు.  పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహరాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. బిహార్ క్యాడర్ కు చెందిన అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019 లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు పీఎంవో సలహాదారుగా నియమితులయ్యారు. అయితే పదవీ కాలం ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.