
బోనాల వేడుకల సమీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనాల వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా గ్రేటర్ లో చాలా వరకు వ్యాక్సిన్ ఇవ్వలేదన్నారు. బోనాల నేపథ్యంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని సూచించారు. సాధ్యమైనంత వరకు వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలన్నారు.