
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా హస్తినాపురం సాగర్ ఎన్ క్లేవ్ కాలనీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాహనం వరదలో చిక్కుకుంది. భద్రతా సిబ్బంది, స్థానికుల సాయంతో సుధీర్ రెడ్డి కారును ముందుకు నెట్టారు. అనంతరం కారు నీటి నుంచి బయటకు వచ్చింది. వరద నీటిని మళ్లించేందుకు బీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.