
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ కొనసాగుతున్న విషయం విదితమే. భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల శాఖపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు.