https://oktelugu.com/

Microsoft XP : ఈ ఖరీదైన విండోస్‌ ఎక్స్‌పీ వాల్‌ పేపర్‌ రేటు ఎంతో తెలుసా?.. ఫొటోగ్రాఫ్‌కు మైక్రోసాఫ్ట్‌ ఎంత చెల్లించిందంటే?

ప్రపంచంలో దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో మైక్రోసాఫ్ట్‌ ఒకటి. బిలియన్ల డాలర్ల వ్యాపారం చేసే మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీ వర్షన్‌ నడుసప్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 25, 2024 / 05:29 PM IST

    Microsoft XP

    Follow us on

    Microsoft XP : ప్రపంచంలో 90 శాతం కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. అంతలా మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. తర్వాత అనేక సాఫ్ట్‌వేర్లు వచ్చినా.. మైక్రోసాఫ్ట్‌లా పని చేయడం లేదు. దీంతో చాలా మంది మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌నే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వినియోగిస్తున్నారు. ఇక మన ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ ఓపెన్‌ చేయగానే డీఫాల్ట్‌గా ఓ వాల్‌పేపర్‌ కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన ఫొటో. 1996లో కాలిపోర్నియాలో తన కాబోయే భార్యను కలవడానికి వెళ్తినప్పుడు నేషనల్‌ జియోగ్రాఫిక్స్‌ ఫొటో గ్రాఫర్‌ అయిన చక్‌ ఓరియర్‌ దీనిని క్లిక్‌ చేశాడు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ దానిని స్టాక్‌ ఫొటో ఏజెన్సీ అయిన కార్బిస్‌ నుంచి కొనుగోలు చేసింది. దానికి బ్లిస్‌ అని పేరు పెట్టింది. తర్వాత సుందరమైన ప్రకృతి దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఫొటో కోసం మైక్రోసాఫ్ట్‌ భారీగానే చెల్లించిందట. ఎంత చెల్లించింది అనేది ఎవరూ వెల్లడించలేదు.

    100,000 డాలర్లు..

    అయితే లాడ్‌ బైబిల్‌ ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌ బ్లిస్‌ ఫొటో కోసం ఏకంగా 100,000 డాలర్లకుపైగా చెల్లించినట్లు తెలిసింది. ఇది ఒక ఫొటో కోసం చెల్లించి అత్యధిక మొత్తంగా నిలిచింది. చక్‌ ఓ రియర్‌ మామియా ఆర్‌జెడ్‌ 67 ఫిల్మ్‌ కెమెరాతో దీనిని తీశాడు. అతను దానిని కార్బిస్‌కు సమర్పించాడు. తరువాత మైక్రోసాఫ్ట్‌ ఫొటోను చూసి కొనుగోలు చేసింది. సుందరమైన పచ్చని కొండలు మరియు అందమైన తెల్లటి మేఘాలతో బ్లిస్‌ ఫోటో వ్యామోహానికి చిహ్నంగా మారింది మరియు ఇది ఎప్పటికీ ఉంటుందని భావిస్తున్నారు.

    మరొక వాల్‌ పేపర్‌కు..
    మైక్రోసాఫ్ట్‌ సంస్థ బ్లిస్‌ కాకుండా, మైక్రోసాఫ్ట్‌ మరొక వాల్‌పేపర్, ఆటంను కూడా కొనుగోలు చేసింది, దీనిని పీటర్‌ బురియన్‌ క్లిక్‌ చేసి, కార్బిస్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయినప్పటికీ, పీటర్‌ బురియన్‌ చక్‌ ఓ’రియర్‌ కంటే చాలా తక్కువగా అందుకున్నాడు, అతని ఫోటోకు కేవలం 45 డాలర్లు మాత్రమే. అయినప్పటికీ, చక్‌ ఓ రియర్, పీటర్‌ బురియన్‌ ఫొటోలు రెండూ ఇప్పటికీ విండోస్‌ ఎక్స్‌పీతో అనుబంధించబడి ఉన్నాయి.

    జియోగ్రాఫిక్స్‌ ఫొటో గ్రాఫర్‌..
    ఇదిలా ఉంటే చక్‌ ఓ రియర్‌ జియో గ్రాఫిక్స్‌ ఫొటో గ్రాఫర్‌. తాను ఎప్పుడూ కెమెరాను తీసుకెళ్తానని, ఫోటోలు తీయడానికి డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు తరచుగా ఆపివేస్తానని వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతీకంప్యూటర్‌లో ఏదో ఒక రోజు డిఫాల్ట్‌ డెస్క్‌టాప్‌ ఇమేజ్‌ అవుతుందని గ్రహించకుండానే అతను బ్లిస్‌ ఫొటోను క్యాప్చర్‌ చేశాడు. ఫొటో మన సామూహిక స్మృతిలో భాగమైంది.