తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. పలువురు ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్ పాదయాత్రతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరో రెండున్నరేళ్లు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ, టీపీసీసీ అధ్యక్షుడు మార్పు, షర్మిల కొత్తపార్టీ, అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకునుందుకు సన్నాహాలు చేస్తోంది.