
హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ట్ ల్యాబ్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సంస్థకు చెందిన హౌస్ కీపర్ యశోద (40) సజీవ దహనమవగా మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.