Mana Shankara Varaprasad Garu : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలలోను కెపాసిటీ సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ సినిమాని చూడాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ, కానీ థియేటర్స్ తక్కువ ఉండడం వల్ల చూడలేకపోతున్నారు. ఈ చిత్రం తో పాటు నాలుగు సినిమాలు విడుదల అవ్వడం వల్ల డిమాండ్ కి తగ్గ షోస్ దొరకడం లేదు. ఇకపోతే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 127 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 78 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటీకి వరకు 58 కోట్ల రూపాయిల షేర్, 86.30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 122 కోట్ల రూపాయలకు జరిగింది.
అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవడానికి దాదాపుగా 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి అన్నమాట. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 19 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మూడవ రోజున దాదాపుగా 5 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని 11 లక్షల మంది చూశారట. ఇక సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి మూడవ రోజున 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ ప్రాంతం లో 8 కోట్ల 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మొదటి మూడు రోజులకు కలిపి 7 కోట్ల 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తూర్పు గోదావరి జిల్లా నుండి 5 కోట్ల 61 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 4 కోట్ల 51 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 5 కోట్ల 42 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 4 కోట్ల 10 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద నేడు వచ్చే వసూళ్లు నిన్నటి కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే రేంజ్ జోరు ని కొనసాగిస్తూ ముందుకు పోతే, ఈ వీకెండ్ కి ఈ చిత్రం 220 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.