
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తే తప్పేంటి అంటూ నిర్మాత బండ్ల గణేశ్ ప్రశ్నించారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ని నాన్ లోకల్ అనడం పై గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రకాశ్ రాజ్ తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారని ఆయన ఎలా నాన్ లోకల్ అవుతారని ప్రశ్నించారు. సినిమాల కోసం ముంబై, కేరళ, కర్ణాటక నుంచి హీరోయిన్స్ ని టాలీవుడ్ లోకి తీసుకువస్తే తప్పులేదు కానీ ప్రశాశ్ రాజ్ పోటీ చేస్తే తప్పా అని అన్నారు.