
కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హత్యకు గురైన గడివేముల మండలం, పెసరవాయి గ్రామం టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇప్పటి వరకు 27 మంది టీడీపీ నేతలను అతి దారుణంగా చంపారన్నారు. చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎదురుదాడి చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.