
సీఎం జగన్ పాలనలో ఆఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. బైక్ పై వెళ్తున్న జంటపై దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడటం అమానుషమని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వెళ్లే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం దారుణమన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని ఎద్దేవా చేశారు.