కరోనా కట్టడికి అమల్లో ఉన్న లాక్ డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత లాక్ డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని జూన్ 7 వరకూ ఇవే నియంత్రణలు కొనసాగుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కిరాణా దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకూ ఆర్డర్లు తీసుకుని సరుకులను కస్టమర్ల ఇంటికి చేర్చేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. జూన్ లో రేషన్ షాపుల ద్వారా కార్డు దారులకు 13 నిత్యావసర వస్తువులతో కూడిన కిట్ ను అందజేస్తామని తెలిపారు.