
వైద్యం కోసం ప్రజలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్తున్నారని ఏపీ సీఎం జగన్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాలకు వైద్యం కోసం ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శుక్రవారం కరోనా కట్టడి చర్యల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలి. ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి. ఒక్కో ఆస్పత్రికి ఐదెకరాల చొప్పున కేటాయించాలని తెలిపారు.