
హైదరాబాద్ లో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.