
ముఖ్యమంత్రి జగన్ కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు అన్యాయం జరిగిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కరువు జిల్లా గొంతు కోయవద్దని వేడుకుంటున్నామని అన్నారు.