https://oktelugu.com/

Pushpa 2 : లీకైన ‘పుష్ప 2 : ది రూల్’ ఐటెం సాంగ్..శ్రీలీల స్టెప్పులు మామూలుగా ఉండేలా లేదుగా!

ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. నిన్ననే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ కి శ్రీలీల విచ్చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 02:02 PM IST

    Pushpa 2 Item Song

    Follow us on

    Pushpa 2 :  కోట్లాది మంది అభిమానులు గత మూడేళ్ళుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 : రూల్’ ఎట్టకేలకు వచ్చే నెల 5 వ తారీఖున అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలైంది. నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్స్ కి 3000 కి పైగా షోస్ ని షెడ్యూల్ చేయగా, 5 లక్షల 50 వేల అమెరికన్ గ్రాస్ డాలర్లు ఇప్పటి వరకు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఆల్ టైం రికార్డు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ, 2 మిలియన్ డాలర్స్ కి పైగా ప్రీమియర్స్ నుండి గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే విధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు మేకర్స్.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. నిన్ననే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ కి శ్రీలీల విచ్చేసింది. అయితే షూటింగ్ లో ఆమె అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్స్ వేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటో ని చూస్తుంటే శ్రీలీల డ్యాన్స్ చితకొట్టేసినట్టు అర్థం అవుతుంది. అల్లు అర్జున్ లాంటి అద్భుతమైన డ్యాన్సర్ కి శ్రీలీల లాంటి డ్యాన్సర్ తోడైతే థియేటర్స్ పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ హిట్ అవ్వడానికి ఈ ఒక్క ఐటెం సాంగ్ చాలు అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

    ముందుగా ఈ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న శ్రద్దా కపూర్ ని సంప్రదించారు. ఆమె చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ, తక్కువ డేట్స్ మాత్రమే ఇస్తానని చెప్పిందట. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గి, శ్రీలీల ని సంప్రదించారు. శ్రీలీల గతంలో అనేక ఇంటర్వ్యూస్ లో ఐటెం సాంగ్స్ చేయడానికి ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ పుష్ప 2 చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండడం తో ఆమె నో చెప్పలేక ఈ ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. నాలుగు రోజుల పాటు ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరగనుంది, ఆ తర్వాత క్లైమాక్స్ కి సంబంధించిన చిన్న రీ షూట్ ఉందట. ఈ రెండు చిత్రీకరణ పూర్తి అయ్యాక సెన్సార్ కి వెళ్లబోతుందని సమాచారం.