Sonia Gandhi Health: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి పై ఢిల్లీ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు అప్డేట్ ఇచ్చారు. సోనియా గాంధీ కడుపు నొప్పితో నిన్న రాత్రి 9 గంటలకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అని ప్రకటన విడుదల చేశారు.