https://oktelugu.com/

Kushboo : షూటింగ్ సెట్స్ లో ఆ సీనియర్ హీరోని చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ కుష్బూ..అసలు ఏమైందంటే!

సౌత్ ఇండియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కుష్బూ. బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ హిందీ సినిమాల్లో నటించిన ఈమె,1985 వ సంవత్సరంలో 'జాను' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 04:19 PM IST

    Kushboo, the heroine who gave a warning that she will hit the senior hero with a shoe on the shooting sets.. What actually happened!

    Follow us on

    Kushboo : సౌత్ ఇండియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కుష్బూ. బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ హిందీ సినిమాల్లో నటించిన ఈమె,1985 వ సంవత్సరంలో ‘జాను’ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత తెలుగు లో విక్టరీ వెంకటేష్ మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈమెకు, ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు సంపాదించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమెకు కోలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అక్కడ వరుసగా రెండు మూడు భారీ హిట్స్ తగలడంతో కుష్బూ క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఏ స్థాయిలో అంటే ఆమెకి అక్కడి జనాలు గుడి కట్టేంత అన్నమాట. ఎంతో మంది సూపర్ స్టార్ హీరోలకు కూడా దక్కని అరుదైన గౌరవం కుష్బూ కి దక్కింది.

    ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే అమ్మాయిలకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఏర్పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దశాబ్దాల నుండి ఈ సమస్య ప్రతీ ఇండస్ట్రీ లో ఉన్నదే. ఈ సమస్య కుష్బూ కి కూడా ఎదురైంది అట. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సంఘటన గురించి చెప్తూ ‘క్యాస్టింగ్ కౌచ్ సమస్య నాకు కూడా ఎదురైంది. ఒక సీనియర్ హీరో నేను సెట్స్ లో ఉన్నప్పుడు ఏమైనా అవకాశం వస్తే నాకు ఛాన్స్ ఇస్తావా అని డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. అప్పుడు నా చెప్పు సైజు 41 ఉంది, ఇక్కడే నిన్ను దాంతో కొట్టమంటావా?, లేకపోతే అందరి ముందు కొట్టమంటావా అని అన్నాను. ప్రతీ అమ్మాయికి ఇలాంటి సందర్భాలు ఎదురు అవుతూనే ఉంటాయి. అమ్మాయిలు ఇలా బలంగా సమాధానం చెప్తే కచ్చితంగా కచ్చితంగా చెడు బుద్ధి ఉన్న మగవాళ్ళు భయపడతారు’ అంటూ చెప్పుకొచ్చింది కుష్బూ.

    ఇంతకు ఆ సీనియర్ హీరో ఎవరు ఏమిటి అనేది కుష్బూ పేరు బయటకి చెప్పలేదు కానీ, ఎవరు ఆ సీనియర్ హీరో అయ్యుంటాడు అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆమె తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. చేసిన సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్, నాగార్జున తో తప్ప ఎవ్వరితోనూ చెయ్యలేదు. వాళ్లిద్దరూ ఈమెతో ఇలా ప్రవర్తించే అవకాశమే లేదు, తమిళం లో ఈమె దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. కాబట్టి ఆమెకి అక్కడే ఇలాంటి చేదు అనుభవం ఎదురు అయ్యుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. కుష్బూ లాంటి స్థిరపడిన హీరోయిన్ కే ఇలాంటి అనుభవం ఎదురైతే, ఇక అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.