
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్లను కేటీఆర్ ప్రారంభించారు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం నుంచి నోవాటెల్ గేట్ రోడ్డు, మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్, వసంతసిటీ నుంచి న్యాక్, జేవీజీ హిల్స్ నుంచి మసీద్ బండ వరకు కొత్తగా అభివృద్ధి చేసిన రోడ్లను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే 16 లింక్ రోడ్లను పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు. లింక్ రోడ్లతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుందన్నారు.