వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు టీమ్ ఇండియా సన్నద్దమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానె, విరాట్ కోహ్లీ, పుజారా, ఇషాంత్ శర్మ, బుమ్రమా, రిషబ్ పంత్ తదితరులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా శుక్రవారం కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నాడు. జడేజా అతని భార్య రివాబా రాజ్ కోట్ లో టీకా వేసుకున్నారు.