
కరోనా మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. చిన్నారులపై కోవావాక్స్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ( డీసీజీఐ) కు దరఖాస్తు చేసుకోనుంది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రాంభించనున్నట్లు తెలుస్తోంది.