
నగరంలోని కూకట్ పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పుల జరిపి నగదు ఎత్తుకెళ్లిన కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి నుంచి సేకరించిన వివరాలను పోలీసులు ఇవాళ సాయంత్రం లేదా రేపు వెల్లడించే అవకాశం ఉంది.