
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై గాంధీ భవన్ మెట్లక్కనని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలవద్దన్నారు. అది టీపీసీసీకాదని, టీడీపీ పీసీసీగా మారిందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ అని విమర్శించారు. పీసీసీని ఇంచార్జి అమ్ముకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గం జిల్లాకే పరిమితమవుతానన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు.