
ఈ రోజు జరుగుతున్న 16వ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీస్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణిత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 229పరుగులు చేసింది. ఢిల్లీకి మొదట్లోనే మంచి ఆరంభం దక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుంది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా 66, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 88 పరుగులు చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 26, రిషబ్ పంత్ 38 పరుగులతో రాణించారు.