
తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. నూతన క్రమశిక్షణ కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కోదండరెడ్డి రాజీనామా లేఖ పంపించారు. ప్రస్తుతం కోదండరెడ్డి ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.