https://oktelugu.com/

Kodandaram: కేసీఆర్ సర్కార్ పై కోదండరాం విమర్శలు

కేసీఆర్ సర్కార్ పై కోదండరాం విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక్కడే ప్రగతి భవన్ లో ఉంటే ప్రతిపక్షాలు అన్ని ఇందిరా పార్క్ వద్ద ఉన్నాయి. తెలంగాణ లో ఆరోగ్య సంక్షోభం నెలకొందని అన్నారు. కోవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నా భిన్నం డిమాండ్ల సాధన మొదలు పెడితే కేసీఆర్ నల్ల చట్టాలు తెర మీదకు తెస్తున్నారు. సంపన్నులకు లాభం చేకూరేలా ధరణి చట్టం. ధరణి లో అసలు అప్లికేషన్లు తీసుకొనే వాళ్ళు ఎవరో తెలియదు. పోడు భూములకు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 22, 2021 12:42 pm
    Follow us on

    కేసీఆర్ సర్కార్ పై కోదండరాం విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక్కడే ప్రగతి భవన్ లో ఉంటే ప్రతిపక్షాలు అన్ని ఇందిరా పార్క్ వద్ద ఉన్నాయి. తెలంగాణ లో ఆరోగ్య సంక్షోభం నెలకొందని అన్నారు. కోవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నా భిన్నం డిమాండ్ల సాధన మొదలు పెడితే కేసీఆర్ నల్ల చట్టాలు తెర మీదకు తెస్తున్నారు. సంపన్నులకు లాభం చేకూరేలా ధరణి చట్టం.

    ధరణి లో అసలు అప్లికేషన్లు తీసుకొనే వాళ్ళు ఎవరో తెలియదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. భూమి సేకరణ పేరుతో విచ్చల విడిగా సేకరణ. ఇప్పటి వరకు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం లేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం దోచుకుంటుది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.

    పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ లు ఏకమయ్యాయి. న్యాయమైన పోరాటం చేస్తాం. అన్ని స్థాయిల్లో అఖిలపక్షం పోరాటం చేస్తోంది. ప్రభుత్వం ఇసుక దందాలు,భూ దందాలు చేస్తోంది. ప్రభుత్వం వారి కోసం పని చేస్తోంది.. ప్రజల కోసం కాదు. మన ఓట్లు వేయించుకొని వారి ఆస్తుల కోసం పని చేస్తున్నారు. మనం సాధించుకున్న ధర్నా చౌక్..ఇవ్వాలా మన హక్కుల కోసం ఉపయోగ పడిందని అన్నారు.