https://oktelugu.com/

Kishan Reddy: కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధే ఎక్కువ ఉందని చెబుతూ కంటతడి పెట్టారు. అంబర్ పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని.. అబంర్ పేట బిడ్డగా అంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే […]

Written By: , Updated On : August 21, 2021 / 03:58 PM IST
kishan reddy

kishan reddy

Follow us on

జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధే ఎక్కువ ఉందని చెబుతూ కంటతడి పెట్టారు. అంబర్ పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని.. అబంర్ పేట బిడ్డగా అంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే అందుకు అంబర్ పేట, సికింద్రబాద్ పార్లమెంట్ నియోజవర్గ ప్రజలే కారణమని చెప్పారు.