Tirupati Stampede Report: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మరణించారు. ఈ ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయయణమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఆయన అన్ని కోణాల్లో విచారణ చేశారు. మూడు వాల్యూమ్స్ గా నివేదికను సిద్ధం చేశారు. సచివాలయంలో సీఎస్ కు 200 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిషన్
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి
ఘటనపై అప్పట్లో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తిని ఏకసభ్య కమిషన్‌గా నియమించిన… pic.twitter.com/bj9pKN3CU6
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2025