
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ నీచ రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. తెలంగాణ కేజినెట్ లో పనిచేసే ఏకైక మంత్రి ఈటల రాజేందర్ అని చెప్పారు. ఆరోగ్యశాఖకు కనీస నిధులను కూడా కేసీఆర్ మంజూరు చేయడం లేదని తెలిపారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే చేర్చుకోవడం అనేది మా పార్టీ నాయకత్వం పరిధిలోని అంశమని అరవింద్ చెప్పారు. అనినీతికి పాల్పడిన వారిని బీజేపీ సమర్ధించదు.. ఉపేక్షించదని అరవింద్ పేర్కొన్నారు.