
దేశ రాజధాని ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన అందించడం పై నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణవాయువు లేక అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలకు నిన్న ఆక్సిజన్ సరఫరా కావడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రధాన మంత్రికి లేఖ రాశారు. రోజువారీగా ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగం అవుతోంది. రోజువారీ ప్రాతిపదికన ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కోరారు.