టీఆర్ఎస్ ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తర్వాత కీలక ఘట్టానికి పునాది పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో ఆ పార్టీ కార్యాలయ భవనానికి శంకు స్థాపన జరిగింది. శంకుస్థాపనలో భాగంగా మధ్యాహ్నం 1.48 గంటలకు సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పలువురు తెలంగాణ మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.