కరోనా ఇండియన్ వేరియంట్ అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమవడాన్ని ఉద్దేశిస్తూ భారత్ గొప్ప దేశం కాదని, బద్నాం దేశమని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో అన్ని దేశాలు భారత్ కు విమానాలను నిలిపివేశాయని, ఆయా దేశాల్లో భారతీయులు వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు కొవిడ్ పై విజయం సాధించామని చెప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కేసులు అధికంగా ఉంటే మహమ్మారిని నిందిస్తున్నారని ఆరోపించారు.