https://oktelugu.com/

Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ విషయం చెప్పకపోయినా.. ఆ తరువాత ఒక్కొక్కరు ఆ సంఘటన గురించి అసలు విషయం బయటపెడుతున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2022 11:18 am
    Follow us on

    Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ విషయం చెప్పకపోయినా.. ఆ తరువాత ఒక్కొక్కరు ఆ సంఘటన గురించి అసలు విషయం బయటపెడుతున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్ అనే యువకుడిని కలిపి విచారించారు. దీంతో ఒక్కొక్కరు జరిగిందంతా చెప్పారు.

    ‘పబ్ నుంచి బాలికను తీసుకెళ్లి పెద్దమ్మగుడి సమీపంలో ఓ స్థలంలో నిలిపాం. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు బాలికపై అత్యాచారం చేశాం. అయితే తాము అనుభవించినట్లుగా గుర్తుండిపోవాలని మెడపై పళ్లతో కొరికాం. సాధారణంగా కొందరు టాటూ వేస్తారు. కానీ టాటూల్లా ఉండేలా మెడపై కొరికాం. అందుకే బాలిక మెడపై గాయాలయ్యాయి. ’అనే విషయాన్ని అందరూ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాదుద్దీన్ తోనే తాము అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్లు తెలిపారు. కానీ సాదుద్దీన్ మాత్రం ఎమ్మెల్యే కుమారుడు రెచ్చగొడితేనే అత్యాచారం చేశామని అంటున్నారు.

    దాదాపు గంటసేపు విచారించిన పోలీసులు సాయంత్రం తిరిగి మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు. అయితే ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. బెంజ్ కారులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు..? ఎక్కడెక్కడ సీట్లు మారారు..? అనే విషయాలను రాబట్టేలా ప్రయత్నిస్తున్నారు. ఇన్నోవా కారులో ఎక్కన తరువాత కొద్ది సేపటికే మళ్లీ ఎందుకు దిగారని కూడా పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండా శనివారం పోలీసులు విచారించిన తరువాత ‘టెస్ట్ ఐడెంటిఫికెషన్ పరేడ్’ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే బాలికను తీసుకెళ్లి నిందితులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.

    అంతకుముందు జువెనైల్ హోం లో ఉన్న ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. అయితే ముందుగా నిందితులను వేర్వేరుగా విచారించగా ఎవరూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తరువాత అందరినీ ఒకేసారి విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టారు.