
తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు కొనసాగుతోంది. శనివారం కొన్ని శాఖల కార్యదర్శులతో, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించిన మంత్రి హరీశ్ రావు.. ఇవాళ మిగతా శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖలు గతంలో సమర్పించిన ఖాళీల వివరాలను మరోసారి సమీక్షిస్తున్నారు. ఈ నెల 13న జరగనున్న మంత్రివర్గ సమావేశానికి ఖాళీలకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారు.