
కరోనా వైరస్ కల్లోలం అడిగిన వారికల్లా సాయం చేసి గొప్ప మానవతావాదిగా.. రియల్ హీరోగా సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. సెకండ్ వేవ్ లోనూ సోనూసూద్ సాయం చేస్తూనే వచ్చాడు. ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజలకు వాటిని ఏర్పాటు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.
తాజాగా సోనూసూద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నటుడు తాజాగా ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ లో కనిపించి ఆశ్చర్యపించాడు. ‘సూపర్ మ్యాన్’ చొక్కా ధరించి కనిపించాడు. మీద టై కోటు వేసుకొని డిఫెరెంట్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఒక ఆఫీసర్ గా.. ఏపనైనా చేసే యోధుడిలా ఒకే రూపంలో రెండు కనిపించేలా ఈ ఫొటోను డిజైన్ చేశారు.
ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ పై తన ఫొటో రావడంతో సోనూసూద్ దీన్ని ట్వీట్ చేశాడు. గతాన్ని తలుచుకున్నాడు. తన సినిమా కెరీర్ ప్రారంభంలో పడ్డ కష్టాన్ని ఇక్కడ గుర్తు చేసుకున్నాడు.
‘20 సంవత్సరాల క్రితం ఫిల్మ్ ఫేర్ పై నా బొమ్మ రావాలని కల గన్నాను.. ఆ కల నెరవేరడానికి ఈ సమయం పట్టింది. కలలు సాధించడానికి ఆలస్యం సమస్య కాదని గ్రహించాను’ అని ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఒకప్పుడు ఇదే ఫిల్మ్ ఫేర్ వాళ్లు తనను మోడల్ గా పనికిరావని అన్నారని.. ఇప్పుడదే వాళ్లు తన బొమ్మ పెట్టుకున్నారని.. కాలం, అదృష్టం ఎప్పుడూ మారుతుంటుందనడానికి తనే ఉదాహరణ అని సోనూసూద్ చెప్పుకొచ్చారు.
I still remember the day when I boarded the 'Deluxe Express' from Ludhiana to come to Mumbai to fulfill my dreams & bought a @Filmfare magazine from Ludhiana station. Today after 20 years I'm on the cover and realized it's never too late to achieve your dreams pic.twitter.com/WULy5jcopw
— sonu sood (@SonuSood) July 11, 2021