
తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఈవో గా బాధ్యతలు చేపట్టడానికి డాక్టర్ జవహర్‌రెడ్డి శనివారం ఉదయం తిరుపతి బయలుదేరారు. అయితే అలిపిరి మెట్ల ద్వారా కాలినడకన తిరుమల కొండను ఎక్కారు. టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాత్కలిక ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది. అక్కడి ఉన్న జవహర్‌రెడ్డి టీటీడీకి బదిలీ అయ్యారు