Jaladhivasa Ganapati : వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక ప్రాంతంలో ఒక విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. విగ్నేశ్వరుడికి ఘనంగా పూజలు చేసి.. తమ భక్తిని నిరూపించుకుంటారు. భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను శోభాయమానంగా జరుపుకుంటారు.
మనదేశంలో విభిన్న రూపాలలో గణపతులు దర్శనమిస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది జలాధి వాస గణపతి ఆలయం విశేషమైన గుర్తింపు పొందింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మంగళూరు నగరం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనెగుడ్డి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. అనె అంటే ఏనుగు అని.. గుడ్డి అంటే కొండ అని అర్థం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రస్థాయిలో కరువు ఏర్పడింది. వర్షాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రజల సమస్యను గుర్తించిన అగస్త్య మహర్షి యాగం చేశారు. ఈ సమయంలో కుంభాసురుడు అనే రాక్షసుడు యాగానికి ఆటంకం కలిగించాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి పాండవుల తరఫున భీమసేనుడు వినాయకుడికి పూజలు చేశాడు. భీమసేనుడి పూజలు మెచ్చిన వినాయకుడు రాక్షసుడు ని చంపడానికి ఆయుధాన్ని ప్రసాదించాడు.. ఆ ఆయుధం ద్వారా భీమసేనుడు రాక్షసుడిని సంహరించాడు. ఈ ప్రాంతానికి కుంభాషి అనే పేరు కూడా ఉంది. కుంభాషురుడు అనే రాక్షసుడు పేరు మీదనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
మూడు అడుగుల ఎత్తులో..
ఈ ఆలయంలో గణపతి కేవలం మూడు అడుగులు ఎత్తు మాత్రమే ఉంటాడు. స్వామివారి చుట్టూ నల్లటి శిల్పం ఉంటుంది. వినాయకుడి మెడవరకు నిత్యం నీరు కనిపిస్తూనే ఉంటుంది. చిన్నపాటి రంధ్రం ఎదురుగా ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. విగ్రహం కూడా సగం వరకు నీటిలోనే ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ గణపతిని జలాధి వాస గణపతి అని అంటున్నారు. ఇక్కడ భక్తులు స్వామివారిని సర్వసిద్ధి ప్రదాయక వాసన రాకపోతే అని భావిస్తుంటారు.. ఈ ఆలయం ఉడిపి జిల్లాలోని కుందాపుర పట్టణానికి పరిధిలో ఉంటుంది. మనదేశంలో ఏకైక జలాధివాస గణపతి ఆలయంగా ఈ క్షేత్రం పేరు తెచ్చుకుంది. కేవలం రాతి నుంచి ఈ విగ్రహం ఉద్భవించిందని చరిత్రకారుడు నమ్ముతుంటారు.. కుందాపుర రైల్వే స్టేషన్ కు వరకు వెళ్లి.. ఆ తర్వాత ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. లేదా మంగళూరు విమానాశ్రయంలో దిగి.. అక్కడి నుంచి ప్రత్యేకమైన వాహనాల ద్వారా కుందాపుర ప్రాంతానికి వెళ్లొచ్చు.
Bless You TL With Divine Darshan of 1000 Years Old Kamandala Ganapati Temple.
Temple is located In Koppa of Chikmagalur district, Karnataka is very powerful. Kamandala Ganapathi is famous for its Kamandala Tirtha which is origin of the Brahmi river right in front of Ganesha… pic.twitter.com/ikpSK7KzCG
— (@VoiceOfSaurabh5) July 17, 2024