https://oktelugu.com/

YS Jagan : కెసిఆర్ ను ఫాలో అవుతున్న జగన్.. మంచి ఛాన్స్ మిస్ అవుతున్నారే!

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అధికారం మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన అనివార్య పరిస్థితి నేతలది. అయితే దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన ఇద్దరు నేతలు... శాసనసభకు వచ్చేందుకు ఇష్టపడకపోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 9, 2024 / 12:01 PM IST

    Jagan KCR

    Follow us on

    YS Jagan :  కెసిఆర్ తో జగన్ కు చాలా విషయాల్లో సారూప్యత ఉంది. అందుకే ఆ ఇద్దరు సుదీర్ఘకాలం రాజకీయ మిత్రులుగా కొనసాగుతూ వచ్చారు. ఇద్దరిదీ సెంటిమెంట్ పార్టీలే.ఒకరు ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తెరపైకి తెచ్చి పార్టీ పునాదులు ఏర్పాటు చేసుకున్నారు.మరొకరు తండ్రి మరణాన్ని సెంటిమెంట్ గా మార్చుకొని రాజన్న రాజ్యం అందిస్తానని చెప్పుకొచ్చారు. ఇద్దరినీ తెలుగు ప్రజలు ఆదరించారు. కానీ ఇప్పుడు ఇద్దర్నీ తిరస్కరించారు. ఇప్పుడు ఆ ఇద్దరూ శాసనసభలకు వెళ్లడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఉపయోగించుకోవడం లేదు. దీంతో ఇద్దరూ ఇద్దరే అన్నట్టు పరిస్థితి మారింది. 2014లో తొలిసారిగా తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో గెలిచారు కెసిఆర్. ఆ ఎన్నికల్లో ఏపీ నుంచి తలపడ్డారు జగన్. కానీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాలతో ఆయన ప్రత్యర్థి అయిన జగన్ కు దగ్గర అయ్యారు కెసిఆర్. అప్పటినుంచి వారి మధ్య బంధం ఏర్పడింది. రాజకీయ పరస్పర ప్రయోజనాల కోసం వారిద్దరూ సహకారం అందించుకున్నారు. అయితే పరిస్థితి ఎప్పుడు అలానే ఉండదు. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. తొలుత కేసిఆర్ కు ఆ ప్రతికూల ఫలితం ఎదురయింది. తర్వాత ఆయన స్నేహితుడు జగన్ కు అదే పరిస్థితి ఎదురైంది. ప్రజల కోసం అన్నీ చేస్తే.. తమను విపక్షంలో కూర్చోబెట్టడంపై వారిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

    * 15 నెలలుగా ముఖం చాటేసిన కెసిఆర్
    గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయారు కేసీఆర్. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల సమయంలో కెసిఆర్ గాయానికి గురయ్యారు. తుంటికి గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో శాసనసభకు హాజరు కాలేకపోయారు. ఆరోగ్యం కుదిరిపడ్డాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలకు కేసిఆర్ హాజరవుతారని భావించారు. కానీ తొలి రోజు సమావేశాలకు కనిపించలేదు. అమావాస్య సెంటిమెంట్ కదా అని అంతా అనుకున్నారు. కానీ ఏడాది గడుస్తున్న ఇంతవరకు ఒక్కసారి కూడా శాసనసభలో కనిపించలేదు కేసీఆర్. మేముంటే చాలదా అన్నట్టు కేటీఆర్, హరీష్ రావు సైతం లైట్ తీసుకుంటున్నారు.

    * అవమానంగా భావిస్తున్న జగన్
    మరోవైపు కెసిఆర్ ను అనుసరిస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. వై నాట్ 175 అని నినాదం చేసిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేమని స్పీకర్ తేల్చేశారు. కూటమి తప్ప మరో పార్టీ లేనందున.. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ డిమాండ్ చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. తరువాత సభ వైపు చూసేందుకు సాహసించడం లేదు. ప్రతిసమావేశాల సమయంలో ఏదో ఒక కుంటి సాకు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈసారి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చి శాసనసభకు హాజరు కాలేనని తేల్చి చెబుతున్నారు. అయితే కెసిఆర్ సభలకు హాజరైతే కానీ.. జగన్ హాజరుకారా అని సెటైర్లు పడుతున్నాయి.

    Tags