https://oktelugu.com/

Jabilamma Neeku Antha Kopama Movie Review : ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా ‘ ఫుల్ మూవీ రివ్యూ

Jabilamma Neeku Antha Kopama Movie Review : 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: , Updated On : February 21, 2025 / 12:38 PM IST
Follow us on

Jabilamma Neeku Antha Kopama Movie Review : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ధనుష్(Dhanus)… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ మధ్య రాయన్ సినిమాతో ధనుష్ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రభు కి తన చిన్ననాటి క్లాస్మేట్ అయిన ప్రియ ప్రకాష్ తో మ్యారేజ్ సెట్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన నీలు పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలుస్తుంది. తనా నుంచి వెడ్డింగ్ కార్డు కూడా అందుతుంది. మరి ఆ పెళ్లికి ప్రభు వెళ్లాడా? లేదా అసలు నీల్ కి ప్రభుకి మధ్య బ్రేకప్ ఏం జరిగింది? వాళ్ల మధ్య వచ్చిన గొడవలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ప్రతి సీన్లో ఒక ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉండే విధంగా చూసుకుంటూ వచ్చాడు. అయితే ఫస్టాఫ్ లో సినిమా కొంతవరకు స్లోగా రన్ అయినప్పటికి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. మరి ఏది ఏమైనా కూడా ధనుష్ తన దర్శకత్వ ప్రతిభతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కామెడీ సీన్స్ గానీ లవ్ సీన్స్ ను గాని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ వచ్చాడు.

ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా తను ఏదైతే చెప్పాలి అనుకున్నాడో ఆ కథను స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నమైతే చేశాడు. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ను చాలా బాగా రాసుకున్నాడు. దానివల్ల సినిమా అనేది బాగా ఎలివేట్ అయింది. ముఖ్యంగా జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాలోని సన్నివేశాలను హైలైట్ చేశాడు. ధనుష్ హీరో గానే కాదు దర్శకుడి గా కూడా తన సత్తా చాటుకోవాలని వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో కొంతవరకు పర్వాలేదు అనిపించుకున్నాడు. మేకింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తోంది.

ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ యాంగిల్ లో తీసి ఆయన ఎదైతే కావాలి అనుకున్నాడో దాన్ని సరిగ్గా వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీసిన ఈ సినిమా లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది… ఇక ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా రిచ్ లెవెల్ ను మెయింటైన్ చేశారో ధనుష్ చేసిన ప్రతి షాట్ చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా చాలా హై ప్రొఫైల్లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మాథ్యూ తామస్ చాలా ఎక్స్ట్రాడినరీ నటనను కనబడుచాడు. అక్కడక్కడ నవ్వులు పూయిస్తూనే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఆయన నటనలో ఒక ఈజ్ అయితే ఉంది. దానివల్లే చూసే ప్రతి ప్రేక్షకుడు తనను తాను ఆ క్యారెక్టర్ లో ఎంచుకొని భారీ రేంజ్ లో నటించాడు అంటే మామూలు విషయం కాదు…అనిక సుందరన్ యాక్టింగ్ కూడా బాగుంది ఆమె తన పాత్రలో ఎంతవరకైతే నటించాలో అంతవరకే చేసి మెప్పిస్తూ వచ్చింది. పవిశ్ నారాయణన్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఒక రొమాంటిక్ కామెడీ సినిమాని హై ప్రొఫైల్లో కూడా తీయొచ్చని ఈ సినిమా ద్వారా టెక్నికల్ టీం ప్రూవ్ చేశారు. చాలా రిచ్ విజువల్స్ ఉండడమే కాకుండా స్క్రీన్ కూడా చూస్తున్నంత సేపు చాలా రిచ్ గా అనిపిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక రిచ్ లుక్ అయితే కలుగుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేశారు. జీవి ప్రకాష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ చేసింది. ఇక విజువల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాటోగ్రాఫర్ ప్రతి షాట్ లో ఒక డీటెయిల్ ని మెయింటైన్ చేస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది…ఇక ఎడిటర్ కూడా చాలావరకు క్రిస్పీగా కట్ చేయడానికి ప్రయత్నమైతే చేశాడు…

ప్లస్ పాయింట్స్

కథ
డైరెక్షన్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ లో కొన్ని అనవసరపు సీన్స్
కొన్ని క్యారెక్టర్స్ లో కన్ఫ్యూజన్…

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ || Jabilamma Neeku Antha Kopama Movie Review and Rating