https://oktelugu.com/

Allu Arjun & Trivikram : అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేసే సినిమా మీద క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనువిని ఎరుగని రీతిలో స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోలు కూడా తమదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 03:18 PM IST

    Is this the reason for not giving clarity on Allu Arjun's film with Trivikram..?

    Follow us on

    Allu Arjun & Trivikram : స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక బాలీవుడ్ లో ఈయనకు భారీ క్రేజ్ దక్కడమే కాకుండా అక్కడున్న స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించేలా ఆయన స్టార్ట్ డమ్ ను విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి ఆడియన్స్ ను మెప్పించే విధంగా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తల పైన అల్లు అర్జున్ ఎలాంటి స్పందనలు తెలియజేయడం లేదు. ఇక తను ఎక్కడ కూడా ఈ మాటలను బలపరుస్తూ ఒక స్పీచ్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తాడా లేదా అనే విషయం మీద చాలా వరకు సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం త్రివిక్రమ్ కి పాన్ ఇండియాలో పెద్దగా మార్కెట్ అయితే లేదు. ఇక తన గత చిత్రం అయిన ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

    దీనివల్ల ఇప్పటికే భారీ క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే అల్లు అర్జున్ స్టార్ డమ్ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే వినబడుతున్నాయి. పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న దర్శకులతో తను సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న దర్శకులందరిని పక్కన పెడుతూ ఒక స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి తన కెరీయర్ లో తనకు మూడు మంచి సక్సెస్ లను అందించిన త్రివిక్రమ్ శ్రీనివాసు ను పక్కన పెడతాడా లేదంటే ఆయనతోనే ఇప్పుడు సినిమా చేస్తాడా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

    మరి ఈ సినిమా కనక ఉంటే ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావాల్సింది. కానీ ఇప్పటివరకు అలాంటి అనౌన్స్మెంట్ ఏది రాలేదు. ఇక ఎవరికి వాళ్లు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే చెప్పడం తప్ప దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సందర్భాలు అయితే రాలేదు. మరి ఇకమీదటైనా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే విషయం మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందని సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…